ఉపవాస వ్రతంలో స్త్రీలకు సహకరించాలి | ramjan month started | Sakshi
Sakshi News home page

ఉపవాస వ్రతంలో స్త్రీలకు సహకరించాలి

Published Thu, Jun 15 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

ramjan month started

రమజాన్‌ కాంతులు

స్త్రీలు రోజూ ఐదువేళలా నమాజు చేస్తూ, రమజాన్‌ నెల ఉపవాసాలూ పాటిస్తూ, తన  భర్త పట్ల వినయంతో మసలుకుంటూ, ఆమె భర్త ఆమె యెడల సంతృప్తిగా ఉంటే ఆమె పరలోకాన స్వర్గద్వారాల్లో తనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించవచ్చు. అంతేకాదు, స్త్రీలు ఇంటిపనులు చక్కదిద్దుకుంటూనే తస్బీహ్‌ చేస్తూ బోలెడన్ని పుణ్యాలు మూటగట్టుకోవచ్చు. రోజులో ఒక గంట చొప్పున సమయం తీసి ఖురాన్‌ పారాయణం చేస్తూ ఉండాలి. సమాతె ఖుర్‌ ఆన్‌ కార్యక్రమాల్లోనైనా పాల్గొనవచ్చు. లేదా కనీసం మొబైల్‌ ఫోన్‌లో ఖుర్‌ ఆన్‌ రికార్డింగులైనా వినే ప్రయత్నం చేయాలి. వీటన్నింటితోపాటు తగిన నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నిద్రలేమి వల్ల తలనొప్పి, వికారం, చికాకు, అసహనం కలుగుతాయి. వేడిచేసే పదార్థాలను విడనాడి చలువ చేసే పదార్థాలను సేవించి ఉపవాస వ్రతాన్ని ఆహ్లాదంగా పూర్తి చేయాలి.

ఈ వ్రతాన్ని నిరాటంకంగా పూర్తి చేయడంలో భర్త ఆమెకు సహకరించాలి. ఇంటివారంతా ఇంటిపనుల్లో పాలుపంచుకోవాలి. ఇంటి ఇల్లాలి పైనే భారమేసి వదిలేస్తే ఉపవాసిని కష్టాలకు గురి చేసినట్లవుతుంది. సహర్‌కి దస్తర్‌ఖాన్‌ పరచడం, ప్లేట్లు, గ్లాసులు, నీళ్లు పెట్టడం, తిన్నాక తీయడంలో సహకరించడం వంటి పనులు చేయాలి. ఇఫ్తార్‌లోనూ పండ్లు కోయడం, పానీయాలు తయారు చేయడం వంటి పనుల్లోనూ ఆడ, మగ భేదం లేకుండా తోడ్పాటు అందించాలి. అప్పుడే ఇంటి ఇల్లాలు రమజాన్‌ ఉపవాస ఫలాన్ని ఆనందంగా అనుభవించగలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement