జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF
— Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022
Comments
Please login to add a commentAdd a comment