
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. బాధితురాలి ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. హత్రాస్ ఘటన పట్ల కేంద్రం, యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రతి పక్షాలు దీన్ని మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఇక గురువారం ప్రియాంక, రాహుల్ గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరమార్శించాలని భావించి గ్రామానికి వెళ్లాడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీని నెట్టడంతో ఆయన కిందపడ్డ సంగతి తెలిసిందే. (చదవండి: కోర్టు ఆదేశం ఆశాజనకంగా ఉంది)