లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సంబంధించి రెండు ఆడియో క్లిప్‌లు తెగ వైరలవుతున్నాయి. దీనిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి బాధితురాలి కుటుంబంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ టేప్‌లో సదరు వ్యక్తి ఒకరు బాధితురాలి బంధువుతో ‘మీడియా ముందు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేంగా మాట్లాడాలని’ కోరడం వినవచ్చు. అంతేకాక ప్రియాంక, రాహుల్ గాంధీ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాక సదరు వ్యక్తి ప్రియాంక గాంధీ వచ్చే వరకు ఇంట్లో ఉండమని బాధితురాలి సోదరుడిని కోరడం వినవచ్చు. మరో ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి 25 లక్షల రూపాయలు కాదు 50 లక్షల రూపాయల నష్ట పరిహారం డిమాండ్ చేయాలని సూచించినట్లు వినిపిస్తుంది. (చదవండి: రాహుల్ గాంధీ అరెస్ట్)
ప్రస్తుతం వైరలవుతోన్న ఈ రెండు ఆడియో క్లిప్‌లు హత్రాస్ ఉదంతంలోని రాజకీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇక బాధితురాలి కుటంబాన్ని పరమార్శించడానికి రాహుల్ గాంధీ మరి కొందరితో కలిసి హత్రాస్ వెళ్లాలని భావించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడమే కాక రాహుల్, ప్రియాంకతో సహా 201 మంది మీద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment