వైభవంగా కాత్యాయనీ వ్రతం
పాత గుంటూరు: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం సంపత్‌నగర్‌లోని శ్రీశారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 500 మంది కన్యలతో సామూహిక కాత్యాయనీ వ్రతాన్ని నిర్వహించారు. అంతకుముందు శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి సంచాలకత్వంలో యువ శతావధాని పార్వతీశ్వరశర్మ అష్టావధానం నిర్వహించారు. జె.జె.కె.బాపూజీ, రామడుగు వెంకటేశ్వరశర్మ, కల్వకొలను సూర్యనారాయణ, కె.వి.ఎల్.ఎన్.అప్పలాచార్య, మల్లప్రగడ శ్రీవల్లి తదితరులు ప్రశ్నలను సంధించారు.