
ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన
సాక్షి, అమరావతి: హరికేన్ ఇర్మా బాధితులు ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్థిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని జగన్ ట్వీటర్‌లో ఆకాంక్షించారు.
కరీబియన్ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఈ హరికేన్.. అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.