సుల్తాన్ షూటింగ్లో బిజీ బిజీగా అనుష్క | acter Anushka busy in Sultan movie shooting | Sakshi
Sakshi News home page

సుల్తాన్ షూటింగ్లో బిజీ బిజీగా అనుష్క

Published Fri, Jan 22 2016 2:31 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

సుల్తాన్ షూటింగ్లో  బిజీ బిజీగా అనుష్క - Sakshi

సుల్తాన్ షూటింగ్లో బిజీ బిజీగా అనుష్క

ముంబై:  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్  మోస్ట్ ఎవైటెడ్  మూవీ 'సుల్తాన్ ' షూటింగ్లో బాలీవుడ్ భామ అనుష్క శర్మ  బిజీ గా ఉంది.   తొలిసారిగా సల్మాన్ సరసన నటించే అవకాశాన్ని అనూహ్యంగా  దక్కించుకున్న ఈ బ్యూటీ  షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే  ఆమీర్, షారూక్ లాంటి  బాలీవుడ్  సూపర్ స్టార్లతో నటించి  తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ పీకే భామ మొదటిసారిగా సల్మాన్ కు జోడీగా నటిస్తోంది.

పరిణితీ చోప్రా, కంగనా రనౌత్, క్రితి సనన్ ,దీపికాపదుకొనే కత్రినా లాంటి టాప్ హీరోయిన్ల తో పోటీపడి మరీ అవకాశాన్ని చేజిక్కించుకుంది.  అద్భుతమైన నటనతో పలువురి ప్రశంసలందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ క్యారెక్టర్లో మరింతగా ఒదిగిపోయేందుకు కసరత్తులు చేస్తోందట.

కాగా హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా  రూపొందుతున్న 'సుల్తాన్' 2016 ఈద్కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్  ప్లాన్ చేస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో వస్తున్న ఈ  చిత్రం సగం షూటింగ్ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement