
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మరో రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ ప్లాన్‌ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా ఈద్ ముబారక్ పేరుతో మరో ఎస్‌టీవీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 786 ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ స్పెషల్ ప్లాన్‌వాలిడిటీ 150 రోజులు. ఈ లిమిటెడ్ పీరియడ్ ప్రస్తుతానికి ఢిల్లీ,ముంబైలో అందుబాటులో ఉంటుంది. జూన్ 12నుంచి 26 తేదీల మధ్య ఈ ప్లాన్ రీచార్జ్‌కు లభ్యమవుతుంది. లిమిటెడ్ పీరియ్‌డ్ ఆఫర్ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ప్లాన్ దేశవ్యాప్తంగా లాంచ్ చేసేదీ లేనిదీ క్లారిటీ రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment