special plan
-
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఉదయమే ‘కసరత్తు’... రాత్రి వరకు విధ్వంస తర్ఫీదు
సాక్షి, హైదరాబాద్: విధ్వంసం ఎలా సృష్టించాలి..ఎదుటివారి మక్కెలెలా విరగ్గొట్టాలి. వారు దాడిచేస్తే ఎలా తప్పించుకోవాలి. ఇలా ప్రతిదానికి పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) శిక్షణలో ఓ ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ శిక్షణలో ప్రతి అర్ధగంటకు ఏఏ పనులు చేయాలి. ఏ విషయాల్లో శిక్షణ ఇవ్వాలన్న టైమ్‌టేబుల్ సైతం పీఎఫ్ఐ నాయకులు తయారు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. తెలంగాణలో తొలిసారి వెలుగుచూసిన పీఎఫ్ఐ మూలాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్, పశి్చమబెంగాల్, అస్సోం, జమ్మూ, కశ్మీర్, మణిపూర్‌తోపాటు సింగపూర్, కువైట్, కతార్, ఓమన్, సౌదీఅరేబియా, యూఏఈ వంటి దేశాల్లోనూ విస్తరించినట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు పీఎఫ్ఐ శిక్షణకు టైం టేబుల్‌ను గుర్తించారు. అందులో పలు విస్తుపోయే అంశాలున్నాయి. ప్రాణాయామంతో మొదలు పీఎఫ్ఐలోకి కొత్తగా వచ్చే ఓ వర్గం యువతను విధ్వంసకర శక్తులుగా మార్చేందుకు నిర్వాహకులు ఒక రోజులోని సమయాన్ని మొత్తం ఆరు సబ్జెక్ట్‌లు విడగొట్టి టైమ్‌టేబుల్ రూపొందించారు. ఉదయాన్నే మొదట ప్రాణాయామం చేయిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి శా రీరక దృఢత్వాన్ని పెంచేలా వ్యాయామం ఉంటుంది. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ప్రతి గంటకు, అర గంటకు ఒకటి చొ ప్పున విధ్వంసకరమైన దాడులపై శిక్షణ కొనసాగుతుంది. ఇందులో చేతిలో ఏ ఆయుధం లేకుండానే ఎదుటి వ్యక్తిని పిడిగుద్దులు, తన్నులతో, తలపై కొట్టి రక్తస్రావం వచి్చపడేలా చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నకత్తితో ఎదుటి వ్యక్తి పొట్టలో, తొడలపై పొడవడం ఇలా చేసి కదలకుండా చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. కర్రతో మోకాళ్లపై దాడి చేయడం..మొహంపై కొట్టడం, మెడ పట్టుకొని కిందపడేసి కర్రతో విచక్షణారహితంగా కొట్టడం, పక్కటెముకలపై తన్నడం, కర్రతో దాడి చేయడానికి తరీ్ఫదు ఇస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. తొలి రోజు నుంచే విద్వేషం నూరిపోస్తారు పీఎఫ్ఐలో కొత్తగా చేరిన వారికి మొదటి రోజు నుంచే నిత్యం భగవంతుడిని ప్రార్థన చేయడం అతి ముఖ్యమైన అంశంగా బోధిస్తున్నారు. ఇక్కడి నుంచే వారిలో మత ఛాందస వాదాన్ని నూరిపోస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 2.45 గంటల మధ్య మతపరంగా రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, వాటితో ఉద్రేకపూర్వకంగా మార్చేలా ప్రసంగాలు ఇవ్వడం... ప్రతి రోజూ వార్తలు చదవడం, బృందంగా ఏర్పడి ఒక అంశంపై చర్చ, రైటింగ్ స్కిల్స్ సైతం నేర్పేందుకు ప్రత్యేక సమయం కేటాయించారని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. -
ఐపీఎల్ కోసం జియో ధనాధన్ ప్లాన్
ముంబై : ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులకు రిలయన్స్ జియో ఆకర్షణీయ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఫ్రీ హాట్‌స్టార్ వీఐపీ, డిస్నీ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు అందుబాటు ధరల్లో టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. ఒకటి, రెండు, మూడు నెలలు సహా ఏడాది పాటు వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లతో ప్రత్యేక డేటా యాడ్ఆన్స్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో నూతన ప్లాన్లను ప్రవేశపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు ఈ ప్లాన్లతో డ్రీమ్11 ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఇందులో రూ 401 నుంచి రూ 2599 మధ్య పలు టారిఫ్ ప్లాన్లను జియో ప్రకటించింది. చదవండి : జియో : 10 కోట్ల లోకాస్ట్ స్మార్ట్ ఫోన్లు -
గురుకులాల్లో స్పెషల్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్:పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల కోసం గురుకుల సొసైటీలు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఏటా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నప్పటికీ... ఈ సారి వరుస సెలవులు రావడం...ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు గురుకుల సొసైటీలు ముం దస్తు చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రతి రోజు పరీ క్షలు నిర్వహిం చేందుకు ఉపక్రమించాయి.ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి పాఠశాల ప్రిన్సిపాళ్లకు పం పించాయి. వాస్తవానికి ప్రతి సంవత్సరం నూరు రోజుల ప్రణాళిక పేరిట గురుకుల సొసైటీలు డిసెంబర్ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఈసారి నవంబర్ నుంచే అమలు చేసేం దుకు సిద్ధమయ్యాయి. వరుసగా 24 రోజులు సెలవులు రావడంతో విద్యార్థుల్లో అభ్యసనా కార్యక్రమాలు తగ్గాయి. ఈ నెల 20 నాటికి గురుకులంలో రిపోర్టు చేయాలని సూచించినా... ఆదివారం సాయంత్రానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులు రాలేదు.రవాణా సమస్యలే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో బోధన, అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రతిరోజు స్పెషల్ క్లాసులు... నవంబర్ మొదటి వారం నుంచి 8, 9, 10 తరగతులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఒకే సబ్జెక్టుపైన ఉదయం పూట బోధన, సాయంత్రం పూట అభ్యసన, సందేహాల నివృత్తితో పాటు పరీక్షను నిర్వహిస్తారు. ఇలా వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ప్రతి ఆదివారం విద్యార్థుల సామర్థ్యంపై ఉపాధ్యాయులు విశ్లేషించి, తక్కువ సామర్థ్యం ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇలాంటి వారు ఎక్కు వ మంది ఉంటే ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించి, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. ఈ ప్రణాళికకు అదనంగా పదో తరగతికి మరో కార్యాచరణ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్సీలకు నివేదికలు... పాఠశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను రీజినల్ కో–ఆర్డినేటర్ల(ఆర్సీ)కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మాలను గురుకుల సొసైటీ తయారు చేసి ప్రిన్సిపాళ్లకు పంపింది. దాని ఆధారంగా వివరాలను ఆన్లైన్లో ఆర్సీలకు సమర్పిస్తే వాటిని క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి పంపిస్తారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సొసైటీ కార్యాలయాల్లో విశ్లేషించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు. -
బీఎస్ఎన్ఎల్: ఈద్ ముబారక్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ ప్లాన్‌ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా ఈద్ ముబారక్ పేరుతో మరో ఎస్టీవీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 786 ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ స్పెషల్ ప్లాన్‌వాలిడిటీ 150 రోజులు. ఈ లిమిటెడ్ పీరియడ్ ప్రస్తుతానికి ఢిల్లీ,ముంబైలో అందుబాటులో ఉంటుంది. జూన్ 12నుంచి 26 తేదీల మధ్య ఈ ప్లాన్ రీచార్జ్‌కు లభ్యమవుతుంది. లిమిటెడ్ పీరియ్డ్ ఆఫర్ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ప్లాన్ దేశవ్యాప్తంగా లాంచ్ చేసేదీ లేనిదీ క్లారిటీ రావాల్సి ఉంది. -
బీఎస్ఎన్ఎల్ రోజుకి 3జీబీ డేటా
న్యూఢిల్లీ : పాపులర్ ఐపీఎల్ టోర్నమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టెలికాం కంపెనీల రేసులో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. స్పెషల్ ఐపీఎల్ ప్లాన్‌గా 248 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. తమ ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు ఎస్టీవీ రూ.248పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసుకునేందుకు తమ సబ్స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. మూడు రోజుల క్రితమే రిలయన్స్ జియో కూడా ఐపీఎల్ సందర్భంగా రూ.251 ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీ ఎయిర్టెల్ కూడా హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని తెలిపింది. బీఎస్ఎన్ఎల్ కేవలం 3జీ నెట్‌వర్క్‌నే కలిగి ఉండగా.. జియో 4జీ సర్వీసులను అందించనుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో 2018 ఏప్రిల్ 7 నుంచి 2018 ఏప్రిల్ 30 వరకు ఆ ఆఫర్ పరిమిత సమయంలో అందుబాటులో ఉండనుంది. -
పంట మార్పిడికి పక్కాప్రణాళిక
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేరుశనగలాంటి ఒకే పంట విధానానికి స్వస్తి పలికేందుకు పంట మార్పిడిని ప్రోత్సహించేలా గ్రామస్థాయిలో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక(విలేజ్ యాక్షన్‌ప్లాన్) తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ - 2 ఖాజామొహిద్దీన్ సూచించారు. స్థానిక కృష్ణ కళామందిరంలో గురువారం వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అధ్యక్షతన విలేజ్ యాక్షన్ప్లాన్పై అనంతపురం, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ల ఏడీఏ, ఏవో, ఏఈవో, ఎంపీఈవోలతో సమావేశం నిర్వహించారు. అందులో జేసీ - 2 మాట్లాడుతూ వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి దాని స్థానంలో ఇతర పంటలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ఐదారు రకాల పంటలు వేస్తే ఏదో ఒకటి చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం వేరుశనగ పంటను నమ్ముకోవడం వËల్లే ఏటా రైతులు నష్టపోతున్నారని అన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ వేరుశనగ పంటను ప్రోత్సహిస్తూనే చిరుధాన్యాలు, నవధాన్యపు, పప్పుధాన్యపు పంటలను సాగులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట మార్పిడిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఆత్మ పీడీ డాక్టర్ పెరుమాళ్ల నాగన్న, ఇతర అధికారులు, డాట్ సెంటర్, కేవీకే, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలొచ్చాయ్..
- ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1.25కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఊరట లభించింది. గత వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి గత ఏడాదే ఈ నిధులు మంజూరయ్యాయి. అప్పట్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియతో జిల్లాకు రావాల్సిన ఈ నిధులు నిలిచిపోయాయి. తాజాగా ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లా ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి రూ.1.25 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. 2014-15 సంవత్సరంలో వేసవిలో తాగునీటి సమస్యలనెదుర్కొనేందుకు ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి, ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవడం, ప్రస్తుతమున్న బోర్లు ఫ్లషింగ్తో పాటు లోతు పెంచడం, బోరుమోటార్ల మరమ్మతులు తదితర పనుల్ని సీఆర్ఎఫ్ (విపత్తు నివారణ నిధి) కింద చేపట్టారు. దాదాపు రూ.1.21కోట్లతో పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియతో ఈ ఫైలు అటకెక్కింది. ఒకవైపు పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు నిధులకోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.1.25కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గత బకాయిలు చెల్లించినప్పటికీ ఆర్డబ్ల్యూస్కు కొంత అదనపు నిధులు వలిసివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు వాటిని వినియోగించనున్నట్లు ఆ శాఖ ఇంజినీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి జి. వీరపాండియన్ చెప్పారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఏజెన్సీ పరిధిలో 522 విద్యా సంస్థల ద్వారా ప్రతి ఏటా 50 వేలకు పైగా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చదువు మధ్యలోనే మానేసిన వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు కొండరెడ్డి విద్యార్థుల కోసం మైత్రి క్యాంపు పేరుతో ప్రత్యేక పాఠశాల నిర్విహ స్తున్నట్లు చెప్పారు. 29 మండలాల్లో ఉన్న 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గిరిజన రోగుల ఆరోగ్యపరమైన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 297 మంది ఏఎన్ఎంలు, 41 మంది వైద్యులకు సెల్ఫోన్లను అందజేసినట్లు చెప్పా రు. మార్పు పథకంలో భాగంగా ప్రతీ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి రూ.5 లక్షల చొప్పున మెరుగైన వసతుల కల్పన కోసం మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుం డా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి మాతా-శిశు సంరక్షణకు పాటుపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,744 మంది గిరిజన లబ్ధిదారులకు మేలు చేకూరే విధంగా రూ.17.01 కోట్లు సబ్సిడీని అందజేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి 37 గ్రామ సమాఖ్యలకు 35ట్రాక్టర్లను అందజేశామన్నారు. కొండరెడ్ల అభి వృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 4 గ్రామాలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీసీడీపీ నిధుల కింద రూ.1.72 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. చింతూరు, వీఆర్‌పురం గ్రామాల్లో వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్య నివారణకు రూ.3.31 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ పరిధిలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఏడు ఇసుక రీచ్‌లను గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించటం ద్వారా రూ.18.83 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతంలో జరిగిన లోపాలను పూర్తి స్థాయిలో సమీక్షించిన మేరకు ఈ సారి వీటి నిర్వహణలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ఆయా మండల ఎంపీడీవోలకు దీనిపై బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక పై ప్రత్యేక దృష్టి... ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గిరిజన ఉప ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పీవో తెలిపారు. ఈ పథకం ద్వారా మంజూరైన రూ.189.36 కోట్లతో వివిధ శాఖల ద్వారా 1,271 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్‌డబ్ల్యూఈఏ కింద మంజూరైన రూ.85 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అటవీ హక్కుల చట్టం ద్వారా భద్రాచలం ఏజెన్సీలో ఇప్పటి వరకూ 2,05,705 ఎకరాలకు సంబంధించి అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఏజెన్సీలో మహిళా స మాఖ్యల అభివృద్ధి కోసం ఐకేపీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు, సి బ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్ర మాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో తగు సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా పీవో ప్రశంసా పత్రాలను అందజేశారు. కా ర్యక్రమంలో ఏపీవో శ్రీనివాస్, ఐటీడీఏ మేనేజర్ భీమ్రావ్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, గణాంకపు అధికారి చంద్రిక, జీసీసీ డీఎం వీరస్వామి, పబ్లిసిటీ విభాగం ఏపీవో మహ్మద్ మూర్తజా , అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, ఇంజనీరింగ్ ఈఈ శంకర్ పాల్గొన్నారు.