ముంబై : ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులకు రిలయన్స్ జియో ఆకర్షణీయ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఫ్రీ హాట్‌స్టార్ వీఐపీ, డిస్నీ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు అందుబాటు ధరల్లో టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఒకటి, రెండు, మూడు నెలలు సహా ఏడాది పాటు వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌లతో ప్రత్యేక డేటా యాడ్‌ఆన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా
జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో నూతన ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు ఈ ప్లాన్‌లతో డ్రీమ్11 ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఇందులో రూ 401 నుంచి రూ 2599 మధ్య పలు టారిఫ్ ప్లాన్‌లను జియో ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment