మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ముస్లింల పవిత్రమాసం రంజాన్ ముగిం పు సందర్భంగా శుక్రవారం రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలు ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నూతన వస్త్రాలు ధరిం చి సామూహికంగా ప్రార్థనా స్థలాల్లో పాల్గొని ప్ర త్యేక పండుగ నమాజ్‌ను చదివి సర్వ మానవాళి క్షేమం కోరుతూ అల్లాహ్‌ను వేడుకున్నారు. హిం దూ, ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన కొందరు ముస్లిం లు ఫిత్రా (దానధర్మాలు) చేశారు.
పలువురు ప్ర జా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. నెల రో జులపాటు ఉపవాస దీక్షను కొనసాగించిన ము స్లింలు చివరి రోజు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జామియా మసీదు ఇమామ్ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు...
రంజాన్ పవిత్ర మాసం అనంతరం శుక్రవారం ఈద్‌ఉల్ ఫితర్‌ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరుఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, కలెక్టర్ గిరిజాశంకర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు..
రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా రంజాన్
Published Sat, Aug 10 2013 3:20 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement