మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు రంజాన్ సందర్భంగా శనివారం ‘ఈద్- ఉల్- ఫితర్(రంజాన్)’ పండుగను జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు ఆచరించారు. ప్రత్యేక పండుగ నమాజ్‌ను చదివి సర్వమానవాళి క్షేమంకోసం అల్లాను వేడుకున్నారు. అనంతరం హిందూ, ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆర్థికస్థోమత కలిగిన కొందరు ముస్లింలు దానధర్మాలు చేశారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాగటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ సి.విశ్వప్రసాద్ ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 10 గంటలకు ప్రత్యేకప్రార్థనలు జరిపించారు.
ఈద్ ముబార క్ ..
రంజాన్ పవిత్రమాసం అనంతరం ఈద్‌ఉల్ ఫితర్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్‌ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతిని ధులు, అధికారులు ము స్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నేతలు హైదర్‌అలీ, వాజిద్, శేఖ్ అబ్దుల్లా, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, ఎన్‌పీ వెంకటేశ్, సయ్యద్ ఇబ్రహీం, బెనహర్, బెక్కెం జనార్ధన్, డీఎస్పీ కృష్ణమూర్తి, గోపాల్‌యాదవ్, రిటైర్డు డీసీహెచ్‌ఎస్ డా క్టర్ శ్యామ్యూల్, సీహెచ్ చంద్రయ్య తదితరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భారీ బందోబస్తు..
రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లాకేంద్రం తో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహారా కాశారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా రంజాన్
Published Sun, Jul 19 2015 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement
Advertisement