భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. రంజాన్ సందర్భంగా షరీఫ్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. రంజాన్ సందర్భంగా షరీఫ్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ తరపున పాక్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ప్రత్యేకమైన ఈ రోజున సమాజంలో శాంతి వర్థిల్లాలని మోదీ ఆకాంక్షించారు. పాక్ ప్రధానితో పాటు పొరుగు రాష్ట్రాల ప్రధానమంత్రులకు మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహనీ, యెమన్ అధ్యక్షుడితో పాటు ఆప్ఘనిస్తాన్ రాష్ట్రపతి మహ్మద్ అష్రఫ్ ఘనీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలకు కూడా మోదీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు.