రాయచూరు/బళ్లారి అర్బన్: ఈద్ మిలాద్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన రాయచూరులో మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని షరాఫ్ బజార్, పరకోట, ఖాదర్ గుండ, ఎల్‌బీఎస్ నగర్, షియా తలాబ్, అరబ్ మొహల్లా నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాద్ నబీ ర్యాలీలతో తీనకందిల్ వద్దకు చేర్చారు. 3 గంటలకు తీన్‌కందిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏక్ మినార్, జైలు, నగర సభ, టిప్పూ సుల్తాన్ రోడ్డు, జిల్లాధికారి కార్యాలయం, ఈద్గా మైదానం వరకు నిర్వహించారు.
శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు భోసురాజు, మాజీ ఎమ్మెల్యే యాసిన్, కాడా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, డాక్టర్ తాజుద్దీన్, ఇతర నేతలు పాల్గొని అభినందనలు తెలిపారు ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని బళ్లారిలో భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ, ఉసేన్‌నగర్ మసీద్ సంస్థ, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ వార్డులోని ఉసేన్‌నగర్ మసీదు ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వి మ్స్ డెరైక్టర్ డాక్టర్ వీ.శ్రీనివాస్ శిబి రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
రక్తం తయారు చేయలేమని, మనమే రక్తదా నం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నా రు. 50 మంది రక్తదానం చేసినట్లు తెలి పారు. అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు టీ.అల్లాబకాష్ ఈద్ మిలాద్ శోభయాత్రను ప్రారంభించగా నగర వీధుల గుండా ఊరేగింపు సాగింది. స్పందన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బీ.దేవణ్ణ, ఐఆర్‌సీఎస్ జిల్లా కార్యదర్శి, హోంగార్డ్స్ కమాండెంట్స్ షకీబ్, హాజీ అబ్దుల్ సత్తార్‌సాబ్, విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
కంప్లి : ఈద్ మిలాదున్నబి వేడుకలు కంప్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జోగి కాలువ వద్ద గల బడేసా ఖాద్రి దర్గా నుంచి మక్కా మసీదు చిత్రపటంతో నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగగా దర్గాకు చేరుకున్నారు. మతగురువు సయ్యద్ అబుల్ హసన్ ఖాద్రి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఖాద్రి పాల్గొన్నారు.
సింధనూరు టౌన్: పట్టణంలో ఆదివారం మిలాదున్న బి వేడుకలు ఘనంగా జరిగాయి. మక్కా, మదినాల స్తంభం నమూనాలను కుష్టగి రోడ్డు, టిప్పుసుల్తాన్ సర్కిల్, కిత్తూరు రాణి చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఊరేగించారు. ఖలందరియా కమిటీ, రోషన్ కమిటీ, టిప్పు సుల్తాన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. సింధనూరు తా లూకాలోని హుడా గ్రామంలో ఆదివారం ఆద్ మిలాద్ పండుగను జరుపుకున్నారు. అనంతరం ముస్లింలు ఊరేగింపు నిర్వహించి ప్రార్థన నిర్వహిం చారు. బళగానూరు గ్రామంలో కూడా షా జామియా మసీద్ సన్నిధిలో ఎస్.శెక్షావలి నేతృత్వంలో శనివారం రాత్రి జాగరణ చేపట్టి ప్రార్థనలు నిర్వహించారు.
హొస్పేట : నగరంలో ఆదివారం ఈద్ మిలాద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఐఎస్‌ఆర్ రహదారి ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రముఖ వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
Published Mon, Jan 5 2015 5:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement
Advertisement