
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఏ పండుగ వచ్చినా తనదైన శైలిలో సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకునే ముద్దుగుమ్మ సమయానికి తగినట్టుగా ఇపుడు ముస్లిం సాంప్రదాయంలోకి మారిపోయారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్‌లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.