బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రెండు రోజులు ముందుగానే పండుగ తీసుకొచ్చాడు. ఈద్ కానుకగా కొత్త టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా జీరో మూవీ టీం ముందుగానే ప్రకటించింది. అయితే ఈద్ కన్నా రెండు రోజుల ముందే టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంతేకాదు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు చిత్రయూనిట్. జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈద్ కానుకగా ఈ ఇద్దరు కలిసి నటించిన సన్నివేశాలకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.