పశ్చిమ అఫ్ఘాన్లోని పుల్-ఈ- అలం మసీద్ లో మంగళవారం ఉదయం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో లాగర్ ప్రావెన్స్ గవర్నర్ అరసల జమల్ మరణించారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిన్ మహమ్మద్ దర్విష్ కాబుల్లో వెల్లడించారు. మరో 15 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.
అయితే వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. ఈ - అల్ - అదాహ్ పండగ సందర్బంగా ఈ రోజు ఉదయం పుల్ - ఈ - అలం మసీద్లో ప్రార్థనలు నిర్వహించేందుకు ముస్లీంలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉంచిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజీవ్ డివైజ్ (ఐఈడీ) ఒక్కసారిగా పేలిందన్నారు. అయితే ఆ ఘటనకు బాధ్యులం తామేనంటు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదని దిన్ మహమ్మద్ పేర్కన్నారు.