improvised explosive device
-
పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద అయిదు కేజీల పేలుడు పదార్థం(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని బుద్గామ్‌లోని అరిగాం నివాసి అయిన ఇష్ఫాక్ అహ్మద్ వానీగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత వారం జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులు అరాచానికి పాల్పడిన విషయం తెలిసిందే. కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడం గమనార్హం. చదవండి: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు -
బాంబు పేలి ఆరుగురు దుర్మరణం
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళుతున్న కారు ఒక్కసారిగా బాంబును అమర్చిన పరికరాన్ని తొక్కడంతో భారీ శబ్దంతో విస్ఫోటన చెంది అందులోని వారంత మృత్యువాత పడ్డారు. 'సోమవారం రాత్రి 8.10 గంటల ప్రాంతంలో షా వెయిల్ కోట్ జిల్లాలోని నిఖాషల్లి రోడ్డులో బాంబును అమర్చిన పరికరాన్ని కారుతొక్కడంతో పేలుడు జరిగి అందులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగకమ్ముకుని సమీప ప్రాంతాలు స్వల్ఫంగా ధ్వంసమయ్యాయి. బాంబును తాలిబన్ ఉగ్రవాదులే అమర్చి ఉంటారు' అని ప్రభుత్వ ప్రతినిధి శామిం పాల్ వాక్ తెలిపారు. -
కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పేలుడు
జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో మెందర్ సెక్టర్ నియంత్రణ రేఖ వద్ద పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో పోర్టర్ మరణించాడని ఆర్మీ ఉన్నతాధికి వెల్లడించారు. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతోపాటు మరో పోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అనంతరం సరిహద్దు రేఖ వెంబడి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించిందని ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
మసీద్‌లో బాంబు పేలుడు: గవర్నర్ మృతి
పశ్చిమ అఫ్ఘాన్‌లోని పుల్-ఈ- అలం మసీద్ లో మంగళవారం ఉదయం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో లాగర్ ప్రావెన్స్ గవర్నర్ అరసల జమల్ మరణించారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిన్ మహమ్మద్ దర్విష్ కాబుల్‌లో వెల్లడించారు. మరో 15 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. ఈ - అల్ - అదాహ్ పండగ సందర్బంగా ఈ రోజు ఉదయం పుల్ - ఈ - అలం మసీద్‌లో ప్రార్థనలు నిర్వహించేందుకు ముస్లీంలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉంచిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైజ్ (ఐఈడీ) ఒక్కసారిగా పేలిందన్నారు. అయితే ఆ ఘటనకు బాధ్యులం తామేనంటు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదని దిన్ మహమ్మద్ పేర్కన్నారు.