
సాక్షి, లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ భక్తుడినని ఈద్‌ను జరుపుకోనని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను హిందువునని, ఈద్ వేడుకల్లో ఎందుకు పాల్గొంటానని అన్నారు.తాను యజ్ఞోపవీతం ధరించి అదే సమయంలో ముస్లిం టోపీ ధరించే నమాజ్ చేసే రకం కాదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరోవైపు ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను ప్రతిఒక్కరూ గౌరవించాలని..నమాజ్ ఎప్పుడూ చేస్తుండేదేనని యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మార్చి 11న జరిగే పూల్పూర్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, హోలీ సమయంలో నమాజ్ చేసే వేళలను మార్చడాన్ని సీఎం స్వాగతించారు.