కశ్మీర్లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజు... జమ్మూకకాశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటు వాది హురియత్ నేత జిలానీ గృహ నిర్బంధానికి నిరసనగా కొందరు శనివారం రోడ్లపైకి వచ్చారు. ఈద్ ప్రార్థనల అనంతరం శ్రీనగరలో అనంతనాగ్ లో హురియత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.
దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐఎస్ జెండాలు తరచుగా దర్శనమిస్తున్నాయి.