Gilani
-
భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో విఫలం
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తి వైఫల్యం చెందారని ప్రముఖ పాత్రికేయులు, డీఎన్ఏ పత్రిక న్యూఢిల్లీ సంపాదకులు ఇఫ్తెఖార్ గిలానీ అన్నారు. ఈ పరిస్థితులపై ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల ఉద్యమకారులు స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కశ్మీర్లో మీడియా పరిస్థితి భయంకరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో సీనియర్ పాత్రికేయులు షుజాత్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసినానంతరం కశ్మీర్లో నెలకొన్న మీడియా పరిస్థితులపై శనివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. ఆర్మీ, తీవ్రవాదులు, ప్రభు త్వ అనుకూల ముఠాలు, పోలీసులు మీడియాను శత్రువుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. షుజాత్ బుఖారీ హత్యపై భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్య అనంతరం మీడియాపై బెదిరింపులు తీవ్రస్థాయికి చేరాయన్నారు. పాత్రికేయులు ధైర్యంగా, నిర్భయంగా వార్తలు రాస్తూ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేని పత్రికలకు భారత ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వటం లేదని, ఈ ప్రస్తుత పరిణామాలకు జాతీయ మీడియా కూడా బాధ్యత వహించాలన్నారు. జాతీయ మీడియా నెగటివ్ వార్తలు ప్రచారం చేస్తోందని తెలిపారు. కశ్మీర్ అందాలు, భక్తి భావాల గురించి చెప్పడం మరచి హింస గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్రం తమ విధానం మార్చుకొని ప్రేమపూర్వకంగా నడవాలన్నారు. కశ్మీర్లో జరుగు తున్న మీడియాపై దాడుల విషయం ప్రభుత్వానికి, గవర్నర్‌కు చెప్పిన ప్రయోజనం లేదన్నారు. వార్తలు రాసే పరిస్థితులు కశ్మీర్లో లేవన్నారు. ఇక నార్త్ కశ్మీర్లో వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి అసలే లేదన్నారు. కశ్మీర్లో 13 మంది జర్నలిస్టులు చనిపోతే విచారణలో పురోగతి లేదన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జర్నలిస్టులు చేపట్టే కార్యక్రమాలకు అన్ని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు అండగా నిలబడాలని తెలిపారు. జర్నలిస్టులపై అక్కడ జరిగే దాడుల గురించి మానవ హక్కుల సంఘాలు కానీ ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించటంలేదన్నారు. ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా మాట్లాడుతూ కశ్మీర్లో జరిగే పాత్రికేయుల హత్యలపై జాతీయ మీడియా దృష్టి సారించాలని, కశ్మీర్ పరిణామాలను వాస్తవిక దృక్పథంతో చూడటం లేదని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వ్యతిరేక ప్రచారం చేయడం దారుణమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్టులు కలసి పోరాడినప్పుడే ఇలాంటి ఘటనలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల గొంతు నొక్కడమం టే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని అన్నారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం కశ్మీర్‌ను సందర్శించి నివేదికను తయారు చేస్తే దానిని కేంద్రానికి అందజేస్తామన్నారు. -
గిలానీ లాయర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
పలు డాక్యుమెంట్లు, 4 సెల్ఫోన్లు సీజ్ జమ్మూ/న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ షా గిలానీ లాయర్ దేవిందర్ సింగ్ బిహాల్ ఇంటితోపాటు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇతను కూడా ఉగ్రసాయం ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఎన్ఐఏ ప్రతినిధి పేర్కొన్నారు. తహరీక్ ఈ హురియత్‌లో భాగమైన జమ్ముకశ్మీర్ సోషల్ పీస్ ఫోరమ్(జేకేఎస్పీఎఫ్)కు ఇతను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడన్నారు. అలాగే వేర్పాటు వాదుల లీగల్ సెల్లో సభ్యుడిగా కొనసాగుతున్నట్లు కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో, ఊరేగింపుల్లో ఈయన పాల్గొన్నట్లు చెప్పారు. తనిఖీల్లో పలు డాక్యుమెంట్లను, నాలుగు సెల్ఫోన్లను, ఒక ట్యాబ్‌తో పాటు మరికొన్ని వస్తువులను సీజ్‌చేశామని వివరించారు. అలాగే వచ్చే బుధవారం తమ ముందు హాజరుకావాలని గిలానీ చిన్న కుమారుడు నసీమ్‌కు సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. నేడు ఎన్ఐఏ ముందు హాజరుకావాల్సిన గిలానీ పెద్ద కుమారుడు నయీమ్ చాతినొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు హురియత్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ కేసులో గిలానీ అల్లుడితో పాటు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
గిలానీపై ఎన్ఐఏ విచారణ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్ర సంస్థల నుంచి నిధులు అందుకొంటూ కశ్మీరులో విద్రోహ చర్యలకు పాల్పడుతున్న సయ్యద్ అలీషా గిలానీ, మరో ముగ్గురు వేర్పాటువాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రాథమిక విచారణ చేపట్టింది. ఎన్ఐఏ బృందం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకుంది. గిలానీతోపాటు పాక్ ఉగ్ర సంస్థల నుంచి నిధులు పొందుతూ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన నయీమ్ ఖాన్, ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, తెహరీక్ ఏ హురియత్‌కు చెందిన గాజి జావేద్ బాబాలపై విచారణ చేపట్టినట్టు ఎన్ఐఏ ప్రతినిధి వెల్లడించారు. కశ్మీరు లోయలో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం వంటి విధ్వంసక చర్యలతో అల్లర్లు రేపినందుకు గానూ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ నుంచి ఈ వేర్పాటువాదులకు నిధులు అందుతున్నాయని తెలిపారు. అలాగే ఓ టీవీ జర్నలిస్టుతో వేర్పాటువాదులు జరిపిన సంభాషణలను కూడా పరిగణలోకి తీసుకొంటున్నట్టు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. -
బ్లాక్మెయిల్ చేస్తోంది
చర్చలకోసం పాక్ అడుక్కోవాల్సిన అవసరం లేదు హురియత్ చైర్మన్ గిలానీ వ్యాఖ్య చర్చలే సమస్యకు పరిష్కారం: మీర్వాయిజ్ ఫరూక్ న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను మరుగున పడేసేందుకే.. బూటకపు ఉగ్రవాదం అంశాన్ని భారత్ తెరపైకి తెస్తుం దని కశ్మీర్ వేర్పాటువేద నేత హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీ ఆరోపించారు. ఉగ్రవాదం పేరుతో పాక్‌ను కట్టిపడేయటం ద్వారా కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టడమే భారత్ వ్యూహమని ఆయన విమర్శించారు. ‘భారత్‌తో చర్చల కోసం పాకిస్తాన్ అడుక్కోవాల్సిన అవసరం లేదు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకు.. చర్చలు అవసరం లేదని పాక్ స్పష్టమైన సందేశాన్ని పంపించాలి. అంతవరకు కశ్మీర్లో శాంతి అసంభవమని స్పష్టం చేయాలి’ అని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌తో గురువారం సమావేశం తర్వాత గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారని హురియత్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘చర్చల ప్రక్రియ ద్వారా సమయాన్ని వృధా చేసి ప్రపంచాన్ని మోసగించాలనేదే భారత్ ఆలోచన. రెండుదేశాల్లో ఉగ్రఘటనలు జరుగుతున్నా భారత్ మాత్రమే దీన్ని బూచిగా చూపి పాక్‌ను బ్లాక్మెయిల్ చేస్తోందన్నారు. అయితే.. కశ్మీర్ సమస్యకు భారత్-పాక్ చర్చలే సరైన పరిష్కారమని మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఫరూక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఫరూక్ మరికొందరు వేర్పాటువాద నేతలతో కలసి ఢిల్లీలో పాక్ హైకమిషనర్ బాసిత్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య చర్చలకు తాము వ్యతిరేకం కాదని.. ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయిలో జరగనున్న చర్చలు ఓ మైలురాయిగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎవరు క్లిష్టమైన వైఖరి అవలంబించినా శాంతి ప్రక్రియకు, దక్షిణాసియాలో స్థిరత్వానికి విఘాతం కలుగుతుందన్నారు. -
‘పాకిస్తాన్ డే’ కార్యక్రమానికి రండి: పాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే ‘పాకిస్తాన్ డే’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గిలానీ, అసియా అంద్రబీ సహా పలువురిని పాకిస్తాన్ ఆహ్వానించింది. గిలానీ, అంద్రబీ సహా జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్, హురియత్ మితవాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్‌లతో పాటు మరికొందరు వేర్పాటువాద నేతలను కూడా భారత్‌లోని పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో మార్చి 23న జరిగే పాకిస్తాన్ డే ఉత్సవాలకు ఆహ్వానించారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌కు కూడా ఆహ్వానం పంపించారని, అయితే, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చన్నాయి. -
గిలానీ మద్దతుదారుల ఆందోళన..ఉద్రిక్తం
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేర్పాటు వాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీని గృహనిర్భంధం చేయడంపై ఆయన ఆనుచరులు ఆందోళన చేపట్టారు. గిలానీ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వాటర్‌కెనాన్, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చల ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం సయ్యద్ అలీషా గిలానీనీ గృహనిర్బంధం చేశారు. ఇరుదేశాల మధ్య చర్చలకంటే ముందు దేశంలోని తీవ్ర వాదనేతలతో పాక్ సంప్రదింపులకు దిగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా సలహాదారుల స్థాయి సమావేశానికి అంగీకరించి మళ్లీ హురియత్ నేతల్ని విందుకు ఆహ్వానించడంలో పాక్ ఆంతర్యాన్ని భారత్ ప్రశ్నించింది. కాగా జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనాలంటూ కశ్మీర్ వేర్పాటువాదులకు పాక్ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్ అజీజ్ పిలపునిచ్చారు. ఇరుదేశాల భేటీకంటే ముందు ఆయనతో సమావేశమయ్యేందుకు హురియత్ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గ్రహించిన భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా గురువారం హౌస్ అరెస్ట్ చేసి, వెంటనే ఎందుకు విడుదల చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా ఈ చర్యను తప్పుబట్టారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో భద్రతా సిబ్బంది వెనక్కి తగ్గారు. హురియత్ నేతలను గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు. అయితే వారి కదలికలపై కన్నేసిన పోలీసులు శ్రీనగర్‌ను విడిచి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజు... జమ్మూకకాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటు వాది హురియత్ నేత జిలానీ గృహ నిర్బంధానికి నిరసనగా కొందరు శనివారం రోడ్లపైకి వచ్చారు. ఈద్ ప్రార్థనల అనంతరం శ్రీనగరలో అనంతనాగ్ లో హురియత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐఎస్ జెండాలు తరచుగా దర్శనమిస్తున్నాయి. -
ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్
గృహనిర్బంధంలో హురియత్ చైర్మన్ గిలానీ శ్రీనగర్‌లో అల్లర్లు.. పలువురికి గాయాలు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వేర్పాటువాదులు నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శ్రీనగర్ నుంచి త్రాల్ వరకు జరపాల్సిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో ఘర్షణ చెలరేగింది. ఇటీవల పుల్వామా జిల్లాలో సైన్యం చేతిలో ఇద్దరు యువకులు చనిపోయినందుకు నిరసనగా ఈ ర్యాలీని వేర్పాటువాదులు తలపెట్టారు. ఈ ర్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ పాల్గొనకుండా ఆయన్ను గురువారం రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం శ్రీనగర్‌లో జరిపిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేసిన వేర్పాటువాదనేత మసరత్ ఆలం భట్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బుడ్గాం కోర్టు ఆయనను 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో హింస చెలరేగింది. దేశ వ్యతిరేక చర్యలను సహించబోమని, పాక్ జెండాలు ప్రదర్శించిన, నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుల్వామా ఎన్కౌంటర్ నకిలీదని స్థానికులు అంటుండగా, మృతులు ఉగ్రవాదులని సైన్యం చెబుతోంది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ శుక్రవారం నిర్వహించిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. శ్రీనగర్‌లో హురియత్ మద్దతుదారులు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో డజను మంది గాయపడ్డారు. కాగా రాష్ర్టంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆలం మళ్లీ జైలుకే వెళతాడని, దేశ సమగ్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆలం అరెస్ట్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేయలేదని బీజేపీ పేర్కొంది. రాజ్‌నాథ్ సూచనల మేరకే రాష్ర్ట ప్రభుత్వం స్పందించిందని తెలిపింది. మరోవైపు తన అరెస్ట్ కొత్తేమీ కాదని, రాష్ర్టంలో పాక్ జెండాలను ప్రదర్శించడం, అనుకూల నినాదాలు చేయడం కూడా కొత్త కాదని మసరత్ ఆలం అన్నారు. జాతీయ జెండా దహనం ఇద్దరు యువకుల ఎన్‌కౌంటర్‌పై హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ వర్గం శుక్రవారం నౌహట్టాలో నిర్వహించిన నిరసన ప్రదర్శన అల్లర్లకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు జాతీయ జెండాను తగులబెట్టారు. హురియత్ నేతల అరెస్ట్‌పై ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు చెలరేగాయి. పలుచోట్ల భద్రతాదళాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. మిలిటెంట్ల పేరుతో అమాయక యువకులను సైన్యం పొట్టనబెట్టుకుంటోందని ఫరూఖ్ మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ చైర్మన్ గిలానీ శనివారం కశ్మీర్ లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు.