పలు డాక్యుమెంట్లు, 4 సెల్‌ఫోన్లు సీజ్
జమ్మూ/న్యూఢిల్లీ:
ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ షా గిలానీ లాయర్ దేవిందర్ సింగ్ బిహాల్ ఇంటితోపాటు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇతను కూడా ఉగ్రసాయం ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి పేర్కొన్నారు. తహరీక్ ఈ హురియత్‌లో భాగమైన జమ్ముకశ్మీర్ సోషల్ పీస్ ఫోరమ్(జేకేఎస్‌పీఎఫ్)కు ఇతను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడన్నారు.
అలాగే వేర్పాటు వాదుల లీగల్ సెల్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నట్లు కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో, ఊరేగింపుల్లో ఈయన పాల్గొన్నట్లు చెప్పారు. తనిఖీల్లో పలు డాక్యుమెంట్లను, నాలుగు సెల్‌ఫోన్లను, ఒక ట్యాబ్‌తో పాటు మరికొన్ని వస్తువులను సీజ్‌చేశామని వివరించారు. అలాగే వచ్చే బుధవారం తమ ముందు హాజరుకావాలని గిలానీ చిన్న కుమారుడు నసీమ్‌కు సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. నేడు ఎన్‌ఐఏ ముందు హాజరుకావాల్సిన గిలానీ పెద్ద కుమారుడు నయీమ్ చాతినొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు హురియత్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ కేసులో గిలానీ అల్లుడితో పాటు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గిలానీ లాయర్ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు
Published Mon, Jul 31 2017 4:33 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
Advertisement