న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే ‘పాకిస్తాన్ డే’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గిలానీ, అసియా అంద్రబీ సహా పలువురిని పాకిస్తాన్ ఆహ్వానించింది. గిలానీ, అంద్రబీ సహా జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్, హురియత్ మితవాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్‌లతో పాటు మరికొందరు వేర్పాటువాద నేతలను కూడా భారత్‌లోని పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో మార్చి 23న జరిగే పాకిస్తాన్ డే ఉత్సవాలకు ఆహ్వానించారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌కు కూడా ఆహ్వానం పంపించారని, అయితే, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చన్నాయి.