isis flags
-
ట్రక్కు దాడి సూత్రధారి.. వింత కోరిక
వాషింగ్టన్ : న్యూయార్క్‌లో బుధవారం ట్రక్కు దాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు బలిగొన్న ఉబెర్ డ్రైవర్ సేఫులొ సైపోవ్(29) గాయం కారణంగా బెల్లెవ్యూ ఆస్పతిలో చికిత్స పొందుతున్నాడు. ఐసిస్ సానుభూతిపరుడిగా అతనిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. అవి నిరూపితం కావాల్సి ఉంది. అయితే తాను ఐసిస్ మద్దతుదారుడినేనన్న హింట్ ఇచ్చేసినట్లు అధికారులు చెబుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఆస్పత్రిలోని తన తన గదిలో ఇస్లామిక్ స్టేట్ జెండా పెట్టాలంటూ తనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో గొడవ పడ్డాడు. ‘‘నా ప్రాణాలు తీసిన ఫర్వాలేదు జెండా మాత్రం నా కళ్ల ముందు ఉండాలి. ఇస్లామిక్ రాజ్యం వర్థిల్లాలి. నేను చేసిన పని చాలా మంచిదే’’ అని అతను అధికారులతో పేర్కొన్నాడంట. ఉగ్రదాడి విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని సైపోవ్.. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా హోలోవీన్ డేను ఎంచుకున్నట్టు చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్‌కు సహకరించేందుకే సేఫులొ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏడాది కిందే ప్రణాళిక రచించుకుని.. రెండు నెలల క్రితం ట్రక్కు అద్దెకు తీసుకున్నాడని విచారణలో తేలింది. స్కూల్ బస్సును ఢీకొని ఉండకపోతే మరింత మందిని అతను పొట్టనబెట్టుకునే వాడని అధికారులు చెబుతున్నారు. అయితే ఐసిస్ మాత్రంతో అతడికి నేరుగా సంబంధాలు లేవని వారు పేర్కొనటం విశేషం. మారణ కాండకు ముందు సైఫుల్లా మరో స్నేహితుతుడికి ఫోన్ కాల్ చేశాడని.. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరు కోసం.. రోజుకు రూ.1600 కోట్లను కేవలం ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా ఖర్చు చేసిందంట. సెప్టెంబరు 11, 2001(9/11) ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత రంగంలోకి దిగిన అమెరికా గత పదహారేళ్లుగా రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ మేరకు అమెరికా రక్షణ విభాగం 74 పేజీలతో కూడిన ఓ నివేదికను విడుదల చేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధానికి రూ.84 లక్షల కోట్లు ఖర్చ చేయగా, ఇరాక్, సిరియాలోని రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది. -
శ్రీనగర్‌లో పాక్, ఐసిస్ జెండాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. శ్రీనగర్‌లో పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఆగస్టులో కూడా ఇదే ప్రాంతంలో భారత పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐసిస్ జెండాలను ఎగురవేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్ నిట్‌లో కూడా ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియా ఓడినపుడు లోకల్ విద్యార్థులు సంబరాలు చేసుకోగా, భారత జట్టుకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. -
కశ్మీర్లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజు... జమ్మూకకాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటు వాది హురియత్ నేత జిలానీ గృహ నిర్బంధానికి నిరసనగా కొందరు శనివారం రోడ్లపైకి వచ్చారు. ఈద్ ప్రార్థనల అనంతరం శ్రీనగరలో అనంతనాగ్ లో హురియత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐఎస్ జెండాలు తరచుగా దర్శనమిస్తున్నాయి. -
ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?
పాట్నా:ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో తన ఛాతి బలాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జమ్మూ కళ్మీర్ లో జెండాలు ఎగురవేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. 'మోదీజీ ఇప్పుడు మీకు ఏమైంది?, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై చర్యలు ఏవి?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారా?, ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?అని నితీష్ ప్రశ్నించారు. గత రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఐఎస్ జెండాలతో ఎంత నష్టమో ఆలోచించారా?
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ సంస్థ జెండాలు ఎగురవేయడంపై వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ లో జరుగుతున్న పోరాటంలో ఐఎస్ లాంటి సంస్థల ప్రమేయం అవసరమే లేదన్నారు. శుక్రవారం శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. గడిచిన కొద్ది నెలలుగా కశ్మీర్ లోయలో పాక్ జెండాలు ఎగరడం పరిపాటిగా మారినప్పటికీ మొదటిసారి ఐఎస్ జెండాలు కనిపించడంతో సర్వత్రా ఆశ్చర్యాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి చర్యలు కశ్మీర్ విముక్తి పోరాటాన్ని నీరుగార్చుతాయని, జెండాలు పట్టుకున్న యువకులు ఈ చర్య ఎంత నష్టం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందని గిలానీ అన్నారు. 'ఇప్పటికే మా అస్థిత్వపోరాటాన్ని ఉగ్రవాదంగా చూపుతోన్న భారత ప్రభుత్వం.. దీనిని అవకాశంగా మలుచుకుంటుందని, అంతర్జాతీయ వేదికలపై మమల్ని ఏకాకిగా నిలబెట్టే అవకాశం ఉంది' అని వ్యాఖ్యానించారు. -
కాశ్మీర్లో ఐఎస్ఐఎస్ జెండాలు
జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోకి ఇస్లామిక్ స్టేట్ క్రమంగా చాపకింద నీరులా చొచ్చుకొస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు మీద దాడికేసు దోషి అఫ్జల్ గురు అస్థికలను అతడి స్వగ్రామానికి రప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఇలాంటి సంఘటనలు వద్దంటూ కేంద్రం గతంలో హెచ్చరించినా.. వేర్పాటువాదులు మాత్రం తరచు పాకిస్థాన్ జెండాలను ఎగరేస్తూనే ఉన్నారు.