వాషింగ్టన్ : న్యూయార్క్‌లో బుధవారం ట్రక్కు దాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు బలిగొన్న ఉబెర్ డ్రైవర్ సేఫులొ సైపోవ్(29) గాయం కారణంగా బెల్లెవ్యూ ఆస్పతిలో చికిత్స పొందుతున్నాడు. ఐసిస్ సానుభూతిపరుడిగా అతనిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. అవి నిరూపితం కావాల్సి ఉంది. అయితే తాను ఐసిస్ మద్దతుదారుడినేనన్న హింట్ ఇచ్చేసినట్లు అధికారులు చెబుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
ఆస్పత్రిలోని తన తన గదిలో ఇస్లామిక్ స్టేట్ జెండా పెట్టాలంటూ తనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో గొడవ పడ్డాడు. ‘‘నా ప్రాణాలు తీసిన ఫర్వాలేదు జెండా మాత్రం నా కళ్ల ముందు ఉండాలి. ఇస్లామిక్ రాజ్యం వర్థిల్లాలి. నేను చేసిన పని చాలా మంచిదే’’ అని అతను అధికారులతో పేర్కొన్నాడంట. ఉగ్రదాడి విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని సైపోవ్.. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా హోలోవీన్ డేను ఎంచుకున్నట్టు చెప్పాడని అధికారులు వెల్లడించారు.
ఇస్లామిక్ స్టేట్‌కు సహకరించేందుకే సేఫులొ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏడాది కిందే ప్రణాళిక రచించుకుని.. రెండు నెలల క్రితం ట్రక్కు అద్దెకు తీసుకున్నాడని విచారణలో తేలింది. స్కూల్ బస్సును ఢీకొని ఉండకపోతే మరింత మందిని అతను పొట్టనబెట్టుకునే వాడని అధికారులు చెబుతున్నారు. అయితే ఐసిస్ మాత్రంతో అతడికి నేరుగా సంబంధాలు లేవని వారు పేర్కొనటం విశేషం. మారణ కాండకు ముందు సైఫుల్లా మరో స్నేహితుతుడికి ఫోన్ కాల్ చేశాడని.. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది.
ఉగ్రవాదంపై పోరు కోసం..
రోజుకు రూ.1600 కోట్లను కేవలం ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా ఖర్చు చేసిందంట. సెప్టెంబరు 11, 2001(9/11) ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత రంగంలోకి దిగిన అమెరికా గత పదహారేళ్లుగా రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ మేరకు అమెరికా రక్షణ విభాగం 74 పేజీలతో కూడిన ఓ నివేదికను విడుదల చేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధానికి రూ.84 లక్షల కోట్లు ఖర్చ చేయగా, ఇరాక్, సిరియాలోని రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment