జమ్ముకశ్మీర్లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. శ్రీనగర్లోని పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. శ్రీనగర్లో పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఆగస్టులో కూడా ఇదే ప్రాంతంలో భారత పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐసిస్ జెండాలను ఎగురవేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీనగర్ నిట్లో కూడా ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియా ఓడినపుడు లోకల్ విద్యార్థులు సంబరాలు చేసుకోగా, భారత జట్టుకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు.