Hurriyat
-
వేర్పాటువాద నేతకు పాస్పోర్ట్
శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి ప్రభుత్వం పాస్ పోర్ట్ మంజూరు చేసింది. 9 నెలల కాల వ్యవధితో ఆయనకు పాస్ పోర్టు లభించింది. దాయాది దేశంతో సంబంధాల విషయంలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీకి పాస్ పోర్ట్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, పాక్ పట్ల సానుకూల దృక్పథం వ్యక్తం చేయడం ఆయనకు అలవాటన్న సంగతి తెలిసిందే. నేను పుట్టుకతో భారతీయుడిని కాదని, పాస్ పోర్టు కోసం మాత్రమే అలా చెప్పుకోవాల్సి వస్తుందని గిలానీ గతంలో అన్నారు. కాగా, కూతురును చూసేందుకు విదేశాలకు వెళ్లాలని తనకు పాస్ పోర్ట్ మంజూరు చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల వివాదానికి ప్రభుత్వం తెరదించింది. గిలానీ దరఖాస్తు నిబంధనల మేరకు ఉన్నందువల్లే ఆయనకు పాస్ పోర్టు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
కశ్మీర్లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజు... జమ్మూకకాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటు వాది హురియత్ నేత జిలానీ గృహ నిర్బంధానికి నిరసనగా కొందరు శనివారం రోడ్లపైకి వచ్చారు. ఈద్ ప్రార్థనల అనంతరం శ్రీనగరలో అనంతనాగ్ లో హురియత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐఎస్ జెండాలు తరచుగా దర్శనమిస్తున్నాయి. -
25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని వేర్పాటువాదులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలిసారి జూలై 13న సమ్మెకు పిలుపునివ్వకుండా వదిలేశారు. రంజాన్ మాసం సందర్భంగా వారంతా ఉపవాస దీక్షలు చేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి స్ట్రైక్ చేయకుండా ఆగారని తెలుస్తోంది. 1931 జూలై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట జరుగుతున్న ఆందోళనను నిలువరించేందుకు ఆర్మీ జరిపిన కాల్పుల్లో దాదాపు 21 మంది నిరసన కారులు చనిపోయారు. అప్పటి నుంచి అక్కడ జూలై 13న సెలవు దినంగా పాటిస్తుండగా.. కొందరు వేర్పాటు వాదులు మాత్రం ఆర్మీ చర్యకు నిరసనగా ఆ రోజు సమ్మె చేస్తారు. అమరుల దినంగా పాటిస్తారు. కాగా, ఈ సారి మాత్రం హుర్రియత్ కాన్ఫరెన్స్ ఫ్యాక్షన్స్ అధినేత సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ మహ్మద్ యాసిన మాలిక్ కలిసి ఈ సారి ఎలాంటి సమ్మె నిర్వహించకూడదని నిర్ణయించారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. -
హురియత్ తో చర్చలు లేవు: రాజ్ నాథ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ తో చర్చలు జరిపే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలు కుదుటపడిన తర్వాతే ఏఎఫ్ఎస్పీఏ బలగాలను ఉపసంహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలను గురువారం ఆయన సమీక్షించారు. అమరనాథ్ యాత్రకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ముప్తీ మహ్మద్ సయిద్, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అమరనాథ్ యాత్రలో భాగంగా మంచు శివలింగాన్ని రాజ్ నాథ్ దర్శించుకోనున్నారు.