జమ్మూకశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ తో చర్చలు జరిపే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ తో చర్చలు జరిపే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలు కుదుటపడిన తర్వాతే ఏఎఫ్ఎస్పీఏ బలగాలను ఉపసంహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలను గురువారం ఆయన సమీక్షించారు.
అమరనాథ్ యాత్రకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ముప్తీ మహ్మద్ సయిద్, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అమరనాథ్ యాత్రలో భాగంగా మంచు శివలింగాన్ని రాజ్ నాథ్ దర్శించుకోనున్నారు.