వేర్పాటువాద నేతకు పాస్పోర్ట్
శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి ప్రభుత్వం పాస్ పోర్ట్ మంజూరు చేసింది. 9 నెలల కాల వ్యవధితో ఆయనకు పాస్ పోర్టు లభించింది. దాయాది దేశంతో సంబంధాల విషయంలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీకి పాస్ పోర్ట్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, పాక్ పట్ల సానుకూల దృక్పథం వ్యక్తం చేయడం ఆయనకు అలవాటన్న సంగతి తెలిసిందే.
నేను పుట్టుకతో భారతీయుడిని కాదని, పాస్ పోర్టు కోసం మాత్రమే అలా చెప్పుకోవాల్సి వస్తుందని గిలానీ గతంలో అన్నారు. కాగా, కూతురును చూసేందుకు విదేశాలకు వెళ్లాలని తనకు పాస్ పోర్ట్ మంజూరు చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల వివాదానికి ప్రభుత్వం తెరదించింది. గిలానీ దరఖాస్తు నిబంధనల మేరకు ఉన్నందువల్లే ఆయనకు పాస్ పోర్టు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.