బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలు, బంధువులకు మాంసంతో చేసిన వంటకాలను అందించారు. అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ ప్రాశస్త్యాన్ని మత పెద్దలు, గురువులు వివరించారు.
త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్‌ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ త్యాగానికి అల్లాః ప్రసన్నుడైన పవిత్రదినాన పేదలకు, తమ బంధువులకు విందు ఇచ్చారు. ఉదయం నుంచే మసీదులు కిక్కిరిశాయి. కొత్త బట్టలు ధరించి చిన్నాపెద్దా తేడా లేకుండా పవిత్ర హృదయంతో అల్లాఃను ప్రార్థించారు. జిల్లాలోని ముఖ్య నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.