నెల్లూరు (కల్చరల్) : శుక్రవారం సాయంత్రం జిల్లాలో మబ్బుల చాటున దోబూచులాడుతూ నెలవంక కనిపించడంతో శనివారం ఈద్ ఉల్ ఫిత్‌ర్ పండుగ అని జిల్లా వ్యాప్తంగా ఆన్ని మసీదుల్లో ఇమామ్‌లు ప్రకటించారు. ప్రముఖ మసీదులు, ఈద్గాలు రంజాన్ ప్రార్థనల కోసం సిద్ధమయ్యాయి.
ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయాన్నే వంటపనులు పూర్తిచేసుకుని సామూహికంగా నమాజ్ చదివేందుకు సిద్ధమవుతారు. ప్రార్థనలు పూర్తయిన తర్వాత ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
సంబరాల రంజాన్....
బంధువులను, స్నేహితులను ఆప్యాయంగా కలుసుకునేందుకు రంజాన్ పండుగ అవకాశం కల్పిస్తుంది. నగరంలోని షాపులన్నీ శుక్రవారం కిటకిటలాడాయి. నెలవంక కన్పించడంతో యువకులు టపాసులు కాల్చి సందడి చేశారు. నగరంలో కోలాహలం నెలకొంది.
నేడు రంజాన్
Published Sat, Jul 18 2015 2:04 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement
Advertisement