ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ఈద్ రోజూ ఘర్షణలు చెలరేగాయి. శనివారం ఉదయం ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే పలు ప్రాంతాల్లో ఆందోళన బాట పట్టిన కశ్మీరీ యువకులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. తొలుత అనంత్‌నాగ్ జిల్లా జంగ్లాత్ మండి పట్టణంలో చెలరేగిన ఘర్షణలు ఆ తర్వాత పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
ఘర్షణల్లో బ్రక్‌పోరా పట్టణానికి చెందిన షీరజ్ అహ్మద్ అనే యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు. నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విధినిర్వహణలో నిమగ్నమైన భద్రతా దళాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు.
అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలు భాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించారు. ఘర్షణల్లో ముగ్గురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని, వీరు అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. షోపియాన్ పట్టణంలో యువత కూడా భద్రతా దళాలపై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. రాజధాని శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలోనూ ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఆందోళనకారులు గుమికూడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment