గురువారం రంజాన్ సెలవు | eid holiday declared on thursday | Sakshi
Sakshi News home page

గురువారం రంజాన్ సెలవు

Published Tue, Jul 5 2016 7:02 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

eid holiday declared on thursday

ఈద్-ఉల్-ఫిత‌ర్ (రంజాన్) సెలవును ఈ నెల 7వ తేదీన ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ స‌మ‌న్వయ సంఘం కార్యదర్శి ఎల్.సురేశ్ తెలిపారు. దీనికి అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వ ప‌రిపాల‌నా కార్యాల‌యాల‌న్నింటికీ ఇంత‌కు ముందు నోటిఫై చేసిన‌ట్లుగా ఈ నెల 6వ తేదీన కాకుండా, ఈ నెల 7వ తేదీకి సెల‌వు దినాన్ని మార్చాల‌ని నిర్ణయించింది.

సిబ్బంది మ‌రియు శిక్షణ విభాగం (డీఓపీటీ) ఒక ఆఫీస్ మెమొరాండ‌మ్‌లో ఈ విష‌యాన్ని స్పష్టం చేసింది. దీనితో రంజాన్ సెల‌వును ఈ నెల 6కు బ‌దులు 7వ తేదీకి మార్చినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement