Holiday declared
-
నేడు ప్రభుత్వ సెలవు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
మణిపూర్‌లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఈ నేపధ్యంలో మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.మణిపూర్‌లోని ప్రధాన నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Bank Holidays: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
డిసెంబర్ 2023లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఈ ఐదు ఆదివారాలు, రెండు,నాలుగో శనివారాలతో కలిపి ఈ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు, సమ్మె దినాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిసెంబర్ నెలలో బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, క్రిస్మస్తో కలిపి 8 రోజులు సెలవులు ఉన్నాయి. పనుల నిమిత్తం నేరుగా బ్యాంకుకు వెళ్లేవారు ఏయే తేదీల్లో బ్యాంకులు మూతపడుతాయో తెలుసుకుంటే మేలు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం యథావిధిగా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? డిసెంబర్లో బ్యాంక్ సెలవులు డిసెంబర్ 1: రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 3: ఆదివారం సెలవు డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ, గోవాలోని పనాజీలో సెలవు. డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు. డిసెంబర్ 10: ఆదివారం సెలవు. డిసెంబర్ 12: లోసంగ్/ పా తోగన్ కారణంగా షిల్లాంగ్‌లో సెలవు. డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్టక్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 17: ఆదివారం సెలవు. డిసెంబర్ 18: షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవం, పనాజీలో సెలవు. డిసెంబర్ 23: నాలుగో శనివారం. డిసెంబర్ 24: ఆదివారం సెలవు. డిసెంబర్ 25: క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 26: ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలో సెలవు. డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 31: ఆదివారం సెలవు. -
దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే?
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగ సందర్భంగా హాలీడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, దసరా సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని సర్కార్ పేర్కొంది. ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలంగాణలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ వెల్లడించారు. కాలేజీలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్ -
తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు రేపు(శుక్రవారం, 27 జులై) కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే కురుస్తున్న వర్షాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సెలవును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఆదివారం. దీంతో.. తిరిగి సోమవారమే బడులు తెరుచుకోనున్నాయి. -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
అర్జెంటీనాపై గెలుపుతో సౌదీలో సంబరాలు.. బుధవారం సెలవు ప్రకటన
రియాద్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై చారిత్రక విజయం సాధించింది సౌదీ అరేబియా. పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా జైత్రయాత్రకు సౌదీ బ్రేకులు వేసింది. దీంతో సౌదీలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో బుధవారం సెలవు ప్రకటించింది సౌదీ. ఈ చారిత్రక విజయంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు ఇచ్చింది. సౌదీ జాతీయ జట్టు ఘన విజయం సాధించిన క్రమంలో విక్టరీ హాలీడేను ప్రకటించాలని యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ సూచించారు. ఆయన సూచనకు రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు దినంగా ప్రకటించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఇదీ చదవండి: FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్ చేసుకున్న అర్జెంటీనా -
దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, నిజామాబాద్(నాగారం) : దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రతినిత్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ నుం చి హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వరకు బ స్సులు నడుపనున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు దసరా సెలవులు రావడంతో సొంత గ్రామాల కు పయనం అవుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా సుమారుగా 400 బస్సులను కేటా యింది. ప్రయాణీకుల రద్దీని ఆధారంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలేమాన్ తెలిపారు. జూబ్లీ బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఒక డివిజనల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు సైతం అక్కడే ఉండి మానిటరింగ్ చేస్తారని తెలిపారు. అవసరమైతే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, ఇతర ప్రాంతాలకు సైతం బస్సులను పంపిస్తామన్నారు. దసరా పండుగ రోజు 12 బస్సులు సైతం నడిపించడానికి ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి టౌన్: ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగించినట్లయితే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీగా బస్సులు ఇలా.. 28న 60 బస్సులు 29న 36 బస్సులు 30 12 బస్సులు అక్టోబర్ 1న 12 బస్సులు 2న 12 బస్సులు 3న 12 బస్సులు 4న 60 బస్సులు 5న 60 బస్సులు 6న 60 బస్సులు 7న 8 బస్సులు -
తలైవా మానియా..బంపర్ ఆఫర్
ఫస్ట్ డే..ఫస్ట్ షో..ఎలాగైనా చూసెయ్యాలి...ఇదీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోరిక. మరి అలాంటిది ఎప్పటినుంచో ఉత్కంఠగా చూస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ల గ్రేట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా థియేటర్లను పలకరిస్తోంటే.. ఇక ఆ సందడే వేరు. ఆఫీసులకు సెలవుపెట్టి మరీ మూవీకి చెక్కెయ్యాల్సిందే. అదీ తలైవా మానియా. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరుకు చెందిన ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో బాస్ అంటే వీడేరా అంటూ..ఉద్యోగులు థియేటర్లకు పరుగులు తీయడంలో అతిశయోక్తి ఏముంది... విషయం ఏమిటంటే... కోయంబత్తూరులోని గెట్ సెట్ గో అనే సంస్థ తన ఉద్యోగులకు 2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప్రకటించేసింది. పనినుంచి మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పనిలో పనిగా తలైవా, పద్మవిభూషణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్.. శంకర్ సర్, ప్రతినాయకుడుగా ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్తోపాటు, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసలు కురిపించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజవుతోంది. ముఖ్యంగా దేశీయంగా బాహుబలి-2 రికార్డులను తిరగరాస్తూ వేల థియేటర్లను రోబో చిట్టి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
మిలాదునబి సెలవుల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్ : ఈద్ మిలాదునబి సందర్భంగా ఇంతకు ముందు ప్రకటించిన సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. వచ్చే నెల 2వ తేదీన నెలవంక కనిపించే అవకాశం ఉన్నందున ఆ రోజునే సెలవు ప్రకటించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం.. ముందుగా ప్రకటించిన ఒకటో తేదీ(శుక్రవారం) కాకుండా శనివారం 2వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. -
అప్పుడు కబాలి.. ఇప్పుడు 'ఖైదీ నెం 150'..
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించగా.. తాజాగా రియాద్ లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజు అవుతున్న జనవరి 11ను ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నోటిస్ పేపర్‌ను పోస్ట్ చేశాడు. (చదవండి: ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!) గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్‌లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు. Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of #KhaidiNo150 Release. కబాలి కి ఇలానే... @RGVzoomin @Shekar_News pic.twitter.com/aRRax4azyc — #AkkuPakshi (@urstrulyRD) 8 January 2017 -
గురువారం రంజాన్ సెలవు
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సెలవును ఈ నెల 7వ తేదీన ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ సంఘం కార్యదర్శి ఎల్.సురేశ్ తెలిపారు. దీనికి అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలన్నింటికీ ఇంతకు ముందు నోటిఫై చేసినట్లుగా ఈ నెల 6వ తేదీన కాకుండా, ఈ నెల 7వ తేదీకి సెలవు దినాన్ని మార్చాలని నిర్ణయించింది. సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డీఓపీటీ) ఒక ఆఫీస్ మెమొరాండమ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీనితో రంజాన్ సెలవును ఈ నెల 6కు బదులు 7వ తేదీకి మార్చినట్లయింది.