
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగ సందర్భంగా హాలీడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, దసరా సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని సర్కార్ పేర్కొంది. ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా.. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలంగాణలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది.
అలాగే, రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ వెల్లడించారు. కాలేజీలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్‌ఫెక్షన్