
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచి 14 వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. సెలవుల తర్వాత సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు.