రియాద్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై చారిత్రక విజయం సాధించింది సౌదీ అరేబియా. పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా జైత్రయాత్రకు సౌదీ బ్రేకులు వేసింది. దీంతో సౌదీలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో బుధవారం సెలవు ప్రకటించింది సౌదీ. ఈ చారిత్రక విజయంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు ఇచ్చింది.
సౌదీ జాతీయ జట్టు ఘన విజయం సాధించిన క్రమంలో విక్టరీ హాలీడేను ప్రకటించాలని యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ సూచించారు. ఆయన సూచనకు రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు దినంగా ప్రకటించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.
ఇదీ చదవండి: FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్ చేసుకున్న అర్జెంటీనా
Comments
Please login to add a commentAdd a comment