FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్-2022లో ప్రపంచ 51వ ర్యాంక్ సౌదీ అరేబియాపై ఎవరికీ ఎలాంటి ఆశలు, అంచనాలు లేవు... టోర్నీలో ఆడుతున్న జట్లలో ఒక్క ఘనా మాత్రమే ఆ జట్టుకంటే తక్కువ ర్యాంక్‌లో ఉంది. అలాంటి సౌదీ ఏకంగా అర్జెంటీనా వంటి మేటి జట్టుపై గెలుపొందింది. మాజీ చాంపియన్‌ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా గుర్తింపు పొందింది. అంచనాలు తలకిందులు చేసి నీరాజనాలు అందుకుంటోంది. మరి గతంలోనూ ప్రపంచకప్ ఈవెంట్‌లో ఇలాంటి సంచలనాలు నమోదయ్యాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దామా!
స్పెయిన్ 2–3 నైజీరియా (1998)
నైజీరియా కి ఇది రెండో ప్రపంచకప్ మాత్రమే. ఈ ఓటమితో తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచినా... స్పెయిన్ రౌండ్ దశలోనే నిష్క్ర మించింది.
ఈస్ట్ జర్మనీ 1–0 వెస్ట్ జర్మనీ (1974)
వెస్ట్ జర్మనీ అప్పటికే ఒకసారి చాంపియన్ కాగా, ఈస్ట్ జర్మనీ తొలిసారి వరల్డ్ కప్ ఆడింది.
బ్రెజిల్ 1–2 నార్వే (1998)
నార్వేకు ప్రపంచకప్‌లో ఇది రెండో విజయం మాత్రమే. టోర్నీ లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన బ్రెజిల్ తర్వాతి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడింది.
దక్షిణ కొరియా 2–1 ఇటలీ (2002)
ఇది ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్. మూడుసార్లు విజేత ఇటలీ ఇంటిదారి పట్టింది.
వెస్ట్ జర్మనీ 1–2 అల్జీరియా (1982)
రెండు సార్లు అప్పటికే విజేత అయిన జట్టుపై వరల్డ్ కప్‌లోనే తొలి మ్యాచ్ ఆడిన జట్టు గెలిచింది.
ఇటలీ 0–1 దక్షిణ కొరియా (1966)
తొలి వరల్డ్ కప్ ఆడిన కొరియా ఈ విజయంతో రెండు సార్లు విజేత ఇటలీని రౌండ్ దశలోనే నిష్క్రమించేలా చేసింది.
ఇటలీ 0–1 కోస్టారికా (2014)
ఈ ఓటమితో ఇటలీ ఆట తొలి రౌండ్‌లోనే ముగిసింది.
అర్జెంటీనా 0–1 కామెరూన్ (1990)
మారడోనా నాయకత్వంలోని డిఫెండింగ్ చాంపియన్, రెండో వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ చేతిలో ఓడింది.
ఫ్రాన్స్ 0–1 సెనెగల్ (2002)
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టును, తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన సెనెగల్ ఓడించింది. దాంతో ఫ్రాన్స్ రౌండ్ దశలోనే నిష్క్రమించింది.
చదవండి: అర్జెంటీనాపై గెలుపుతో సౌదీలో సంబరాలు.. బుధవారం సెలవు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment