సాక్షి, నిజామాబాద్(నాగారం) : దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రతినిత్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ నుం చి హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వరకు బ స్సులు నడుపనున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు దసరా సెలవులు రావడంతో సొంత గ్రామాల కు పయనం అవుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా సుమారుగా 400 బస్సులను కేటా యింది. ప్రయాణీకుల రద్దీని ఆధారంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలేమాన్ తెలిపారు. జూబ్లీ బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఒక డివిజనల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు సైతం అక్కడే ఉండి మానిటరింగ్ చేస్తారని తెలిపారు. అవసరమైతే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, ఇతర ప్రాంతాలకు సైతం బస్సులను పంపిస్తామన్నారు. దసరా పండుగ రోజు 12 బస్సులు సైతం నడిపించడానికి ఏర్పాట్లు చేశారు.
కామారెడ్డి టౌన్: ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగించినట్లయితే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోజువారీగా బస్సులు ఇలా..
28న | 60 బస్సులు |
29న | 36 బస్సులు |
30 | 12 బస్సులు |
అక్టోబర్ 1న | 12 బస్సులు |
2న | 12 బస్సులు |
3న | 12 బస్సులు |
4న | 60 బస్సులు |
5న | 60 బస్సులు |
6న | 60 బస్సులు |
7న | 8 బస్సులు |
Comments
Please login to add a commentAdd a comment