Bank Holidays: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. | Bank Holidays In December In Telugu States | Sakshi
Sakshi News home page

Bank Holidays In December 2023: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Published Fri, Dec 1 2023 6:57 PM | Last Updated on Fri, Dec 1 2023 9:16 PM

Bank Holidays In December In Telugu States - Sakshi

డిసెంబర్ 2023లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఈ ఐదు ఆదివారాలు, రెండు,నాలుగో శనివారాలతో కలిపి ఈ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి. ఇందులో  ఆర్‌బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు, సమ్మె దినాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిసెంబర్ నెలలో బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, క్రిస్మస్‌తో కలిపి 8 రోజులు సెలవులు ఉన్నాయి. పనుల నిమిత్తం నేరుగా బ్యాంకుకు వెళ్లేవారు ఏయే తేదీల్లో బ్యాంకులు మూతపడుతాయో తెలుసుకుంటే మేలు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం యథావిధిగా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: వాట్సాప్‌ న్యూ సీక్రెట్‌ ఫీచర్‌.. ఎలా సెట్‌ చేయాలంటే?

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు 

డిసెంబర్ 1: రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 3: ఆదివారం సెలవు
డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ, గోవాలోని పనాజీలో సెలవు.
డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు.
డిసెంబర్ 10: ఆదివారం సెలవు.
డిసెంబర్ 12: లోసంగ్/ పా తోగన్ కారణంగా షిల్లాంగ్‌లో సెలవు.
డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 17: ఆదివారం సెలవు.
డిసెంబర్ 18: షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవం, పనాజీలో సెలవు.
డిసెంబర్ 23: నాలుగో శనివారం.
డిసెంబర్ 24: ఆదివారం సెలవు.
డిసెంబర్ 25: క్రిస్మస్ సెలవు.
డిసెంబర్ 26: ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు.
డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలో సెలవు.
డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31: ఆదివారం సెలవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement