సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు రేపు(శుక్రవారం, 27 జులై) కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.
అయితే కురుస్తున్న వర్షాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సెలవును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఆదివారం. దీంతో.. తిరిగి సోమవారమే బడులు తెరుచుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment