
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ఈనెల 16వ(శనివారం) తేదీన విరామం ప్రకటించారు. పాదయాత్ర తిరిగి ఆదివారం యథాతథంగా కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ 190వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఆత్రేయపురం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కతుంగ క్రాస్ రోడ్డు, లొల్ల, వాడ పల్లి క్రాస్ రోడ్డు మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఉబలంక మీదుగా రావులపాలెం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ రాజన్న బిడ్డ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment