ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్‌లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి.
ఎలా జరుపుకుంటారంటే..
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం..
ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్‌లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది.
#Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not.
— Statista (@StatistaCharts) March 8, 2024
(చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!)
Comments
Please login to add a commentAdd a comment