
కుమారునిన భుజాలపై మోసుకెళ్తున్న తల్లి మహబూబి
కర్ణాటక, సిరుగుప్ప రూరల్: ఉన్నది ఒక్కగానొక్క కుమారుడు. అతను దివ్యాంగుడు. అయినప్పటికీ ఆ తల్లి తన కుమారున్ని అపురూపంగా చూసుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా భిక్షమెత్తుకొని రెండు కాళ్లు లేని కుమారున్ని పోషిస్తూ మాతృప్రేమనుచాటుకుంటోంది. సింధనూరు తాలూకా కెంగల్ గ్రామానికి చెందిన మహబూబికి ఒక్కడే కుమారుడు. ఇతనికి రెండు కాళ్లు లేవు. దీంతో తల్లే అతని ఆలనా పాలన చూస్తోంది. రోజూ భిక్షమెత్తుకొని కుమారున్ని పోషిస్తోంది. ఈక్రమంలో సిరుగుప్పలో ఏటా పెద్ద ఎత్తున జరిగే రంజాన్ సంబరాల కోసం కుమారున్ని వీపున మోస్తూ పట్టణానికి చేరుకుంది. ఆమె మాట్లాడుతూ భిక్షమెత్తుకొని కడుపు నింపకుంటున్నానని, ఏటా జరిగే రంజాన్ సంబరాలకు కుమారుడితో కలిసి సిరుగుప్పకు వస్తుంటానని పేర్కొంది.