సాక్షి, అమరావతి: సార్వత్రిక ఆరోగ్య పరీక్షల్లో భాగంగా గత డిసెంబర్ చివరి నాటికి ఇంటింటి సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం 3.38 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేసింది. సాంక్రమిక, జీవనశైలి జబ్బుల నియంత్రణ కోసం 4.66 కోట్ల మంది జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హెల్త్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానించారు. ఇప్పటికే 72% మందికిపైగా పౌరులకు హెల్త్ ఐడీలు జారీ చేసిన నేపథ్యంలో మిగతావారికి కూడా త్వరగా ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి ఐడీల జారీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచించారు.
ప్రతి ఇంటికి వెళ్లి..
ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక లక్షణాలను బట్టి వైద్యులతో పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారించిన వారందరికీ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment