ఆదివారం సచివాలయంలో కుటుంబ సర్వే నివేదికను చూపుతున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క. చిత్రంలో సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 3.7 కోట్లు.. సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు
గుర్తించిన కుటుంబాలు 1,15,17,457... సర్వే చేసినవి 1,12,15,134 కుటుంబాలు
3 లక్షలకుపైగా కుటుంబాలకు చెందిన 16 లక్షల మంది సర్వేకు దూరం
తాళం వేసి ఉన్న ఇళ్లు 1.03 లక్షలు.. వివరాలు ఇవ్వడానికి నిరాకరించినవారు 1.68 లక్షలు
మిగతా వారంతా రాష్రే్టతర వలస కారి్మకులుగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక ముఖ చిత్రం విడుదలైంది. రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్క తేలింది. గతేడాది నవంబర్, డిసెంబర్‌లలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)’ గణాంకాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. సర్వే వివరాలను, సర్వే జరిగిన తీరును వివరించారు.
సర్వేలో తేల్చిన అంశాలివే..
రాష్ట్రంలో సుమారు 3.7 కోట్ల మంది జనాభా ఉండగా.. అందులో 3.54 కోట్ల మందికి సంబంధించి సర్వే జరిగింది. వివిధ కారణాలతో మరో 16 లక్షల మంది (3.1%)కి సంబంధించిన వివరాల సేకరణ జరగలేదు. సర్వే చేసిన జనాభాకు సంబంధించి పురుషులు 1.79 కోట్లు, మహిళలు 1.75 కోట్లు, థర్డ్ జెండర్ 13,774 మంది ఉన్నారు. ఈ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా 46.25 శాతం మంది బీసీలు ఉన్నారు. తర్వాత షెడ్యూల్డ్ కులాల జనాభా 17.43 శాతం, ఓసీలు 13.31 శాతం, ముస్లిం మైనార్టీలు 12.56 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 10.45 శాతం ఉన్నారు. ముస్లిం మైనార్టీలలో 2.48శాతం ఓసీ కేటగిరీకి చెందినవారు. వీరిని కూడా కలిపితే రాష్ట్రంలో ఓసీ కేటగిరీ జనాభా 15.79% అవుతోంది.
యాభై రోజుల్లో ‘సమగ్రం’గా..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చేందుకు.. సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు వీలుగా సర్వే చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసింది. గతేడాది అక్టోబర్ 10న రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)’ చేపడుతున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 6నలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. తొలి మూడు రోజుల పాటు ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సర్వే సిబ్బంది.. తొమ్మిదో తేదీ నుంచి వివరాల సేకరణ ప్రారంభించారు. నవంబర్ 31 నాటికే పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా.. కొన్నిచోట్ల వివరాల సేకరణ సుదీర్ఘంగా కొనసాగడం, ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో జాప్యం జరిగింది. డిసెంబర్ మూడో వారం నాటికి సర్వే ప్రక్రియ, డేటా ఎంట్రీ పూర్తయింది.
16 లక్షల మంది దూరం..
రాష్ట్రవ్యాప్తంగా 1,15,17,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అందులో 1,12,15,134 కుటుంబాల వివరాలను సేకరించారు. సుమారు మూడు లక్షల కుటుంబాలకు సంబంధించిన సమాచారం సేకరించలేదు. ఇందులో 1.03 లక్షల ఇళ్లు తాళం వేసి ఉండగా.. 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనేందుకు ముందుకురాలేదు. మిగతా కుటుంబాలు రా్రõÙ్టతర వలస కార్మికులు కావడంతో సర్వే చేయలేదు. మొత్తంగా సుమారు 16 లక్షల మందికి సంబంధించిన వివరాల సేకరణ జరగలేదని అంచనా. 96.9 శాతం కచ్చితత్వంతో సర్వే జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ సర్వేలో 94,863 మంది ఎన్యుమరేటర్లు, 9,628 మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. సుమారు 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో 36 రోజుల్లో సర్వే వివరాలను డిజిటలైజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment