Fact Check: కేంద్రం ఒక్కొక్కరికి రూ.5వేల కోవిడ్‌-19 ఫండ్‌ను అందిస్తుందా? | Health Ministry Giving Rs 5000 Under Covid-19 Fund | Sakshi
Sakshi News home page

Fact Check: కేంద్రం ఒక్కొక్కరికి రూ.5వేల కోవిడ్‌-19 ఫండ్‌ను అందిస్తుందా?

Published Wed, Jan 12 2022 6:52 PM | Last Updated on Wed, Jan 12 2022 8:29 PM

Health Ministry Giving Rs 5000 Under Covid-19 Fund - Sakshi

పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం కోవిడ్‌ ఫండ్‌ను విడుదల చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరికి ఒక్కొక‍్కరికి కేంద్ర ఆరోగ్య శాఖ రూ.5 వేలు అందిస్తుంది. అందుకే కేంద్రం ఇచ్చే కోవిడ్‌ ఫండ్‌ పొందాలనుకుంటే వ్యక్తిగత వివరాలు వెల్లడించాలంటూ ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

అయితే దీనిపై కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఇది స్కామ్ అని. అలాంటి ఆఫర్/స్కీమ్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పీఐబీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌నుంచి ట్వీట్‌ చేసింది. 

ప్రజలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని, దాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. వైరల్‌ అవుతున్న లింక్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ఇక జనవరి 15, 2022 వరకు మాత్రమే కేంద్రం కోవిడ్‌ ఫండ్‌ ఇస్తుందని మెసేజ్‌లో ఉందని, ఇది కూడా ఫేక్‌ ఇన్మర్మేషన్‌ అని కొట్టి పారేసింది. ఇలాంటి ప్రమాదకరమైన మెసేజ్‌లను ఎవరూ పట్టించుకోవద్దని,వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరింది.

చదవండి: విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్‌మాల్యా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement