Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్‌లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు.
పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి.
చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..
Comments
Please login to add a commentAdd a comment