న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
Comments
Please login to add a commentAdd a comment