ఒక్కరోజే 61 వేల కేసులు‌, 836 మరణాలు | Coronavirus: 61408 Positive Cases And 836 Deaths Reported In India | Sakshi
Sakshi News home page

కరోనా: ఒక్కరోజే 61 వేల కేసులు‌, 836 మరణాలు

Published Mon, Aug 24 2020 9:56 AM | Last Updated on Mon, Aug 24 2020 11:46 AM

Coronavirus: 61408 Positive Cases And 836 Deaths Reported In India - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరింది. తాజాగా 836 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్‌ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా బాధితుల్లో రికవరీ రేటు 75.27 శాతంగా ఉందని తెలిపింది.
(చదవండి: 2020 ఆగష్టు నాటికి వంతెన రెడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement